USA: ట్రంప్-కిమ్ మధ్య జరిగిన ఒప్పందంలోని అంశాలు

  • ఒప్పందంపై ట్రంప్, కిమ్ సంతకాలు
  • అణు నిరాయుధీకరణకు ఉత్తరకొరియా అంగీకారం
  • శాంతి కోసం ఇరుదేశాల కట్టుబాటు

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్, ఉత్తరకొరియా అధినేత కిమ్ జాంగ్ ఉన్ ఈ రోజు సింగపూర్ లో సమావేశం అనంతరం చేసుకున్న సమగ్ర ఒప్పందంలోని అంశాలు వెల్లడయ్యాయి.

  • రెండు దేశాల ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా, శాంతి, సౌభాగ్యం కోసం నూతన అమెరికా-ఉత్తరకొరియా సంబంధాల ఏర్పాటుకు ఇరు దేశాలు కృషి చేయడం.
  • కొరియా ద్వీపకల్పంలో సుస్ధిర శాంతి కోసం రెండు దేశాలు తమ ప్రయత్నాలను ప్రారంభించడం.
  • 2018 ఏప్రిల్ 27నాటి పన్ ముంజోన్ డిక్లరేషన్ ప్రకారం ఉత్తరకొరియా సంపూర్ణ అణు నిరాయుధీకరణ కోసం కట్టుబడి ఉండడం.
  • వియత్నాం యుద్ద ఖైదీలను గుర్తించి స్వదేశాలకు పంపేందుకు చర్యలు తీసుకోవడం.

More Telugu News