uber app: దేశీయ మార్కెట్లోకి ఊబర్ లైట్ యాప్ విడుదల

  • బేసిక్ స్మార్ట్ ఫోన్లకు సపోర్ట్
  • తక్కువ కనెక్టివిటీ ఉన్నా పనిచేసే యాప్
  • కేవలం 5ఎంబీ సైజు

బేసిక్ ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ యూజర్లు సైతం ఊబర్ సేవలను సులభంగా పొందేందుకు గాను క్యాబ్ సేవల సంస్థ ఊబర్ లైట్ పేరుతో కొత్త యాప్ ను ఈ రోజు భారత్ లో విడుదల చేసింది. దీన్ని త్వరలో ఇతర వర్ధమాన దేశాల్లోనూ విడుదల చేస్తామని కంపెనీ ప్రకటించింది. ఊబర్ లైట్ యాప్ కేవలం 5ఎంబీ మాత్రమే స్పేస్ వినియోగించుకుంటుంది. తక్కువ కనెక్టివిటీ ఉన్న ప్రాంతాల్లోనూ ఈ యాప్ చక్కగా పనిచేస్తుందని కంపెనీ ప్రకటించింది. 300 మిల్లీ సెకండ్లలోనే ఈ యాప్ స్పందిస్తుందని, తక్కువ, పరిమిత కనెక్టివిటీ ప్రాంతాల్లోని వారిని దృష్టిలో ఉంచుకుని ఈ యాప్ ను తీసుకొచ్చినట్టు తెలిపింది. ఊబర్ లైట్ ప్రస్తుతానికి హైదరాబాద్, జైపూర్, ఢిల్లీ నగర వాసులకే అందుబాటులో ఉంటుంది. ఆఫ్ లైన్లో ఉన్నా క్యాబ్ ను బుక్ చేసుకునే వీలుంటుందని కంపెనీ తెలియజేసింది.

  • Loading...

More Telugu News