ఐడియాను వెనక్కి నెట్టేసిన జియో... 19 నెలల్లోనే సంచలనం!
- మార్చి నాటికి ఆదాయ వాటా 20 శాతానికి చేరిక
- ఐడియా వాటా 16.5 శాతమే
- 32 శాతం వాటాతో ఎయిర్ టెల్ నంబర్-1
2018 మార్చి నాటికి జియో ఆదాయ వాటా 20 శాతం సమీపానికి వచ్చేసింది. ఐడియా ఆదాయ వాటా 16.5 శాతంగానే ఉంది. వొడాఫోన్ 21 శాతం వాటాను కలిగి ఉంది. భారతీ ఎయిర్ టెల్ 32 శాతం మార్కెట్ వాటాతో మొదటి స్థానంలో ఉంది. మరో నెలలోపే ఐడియా, వొడాఫోన్ సంస్థల విలీనం పూర్తి కానుంది. దీంతో ఈ రెండు సంస్థల ఆదాయం 16.5 శాతానికి 21 శాతం కలుపుకుంటే 37.5 శాతంతో నంబర్ 1 స్థానానికి చేరుకోగలదు.