rail madad: ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ ను విడుదల చేసిన రైల్వే

  • మంత్రి పీయూష్ గోయల్ ప్రారంభం
  • మొబైల్ యాప్ నుంచి సులభంగా ఫిర్యాదు దాఖలు
  • ఏం చర్య తీసుకున్నదీ ఎస్ఎంఎస్ రూపంలో తెలియజేసే ఏర్పాటు

మదాద్ పేరుతో ప్రయాణికుల ఫిర్యాదుల కోసం ప్రత్యేక యాప్ ను రైల్వే శాఖ విడుదల చేసింది. రైల్వే మంత్రి పీయూష్ గోయల్ దీన్ని ఈ రోజు ఢిల్లీలో ఆవిష్కరించారు. ఫిర్యాదులను వేగంగా, ఓ క్రమపద్ధతిన పరిష్కరించేందుకు ఈ యాప్ ఉపయోగపడనుంది. ప్రయాణ సమయంలో ఈ మొబైల్ యాప్ ద్వారా ప్రయాణికులు ఫిర్యాదులు దాఖలు చేయవచ్చు. పరిష్కారంపై ఎప్పటికప్పుడు రైల్వే నుంచి సమాచారం వస్తుంది.

ప్రయాణికుడు యాప్ ద్వారా ఫిర్యాదు చేసిన వెంటనే ఒక గుర్తింపు ఐడీ జారీ అవుతుంది. వెంటనే ఫిర్యాదు ఆన్ లైన్ లో సంబంధిత అధికారుల దృష్టికి వెళుతుంది. ఏం చర్య తీసుకున్నదీ ఎస్ఎంఎస్ ద్వారా ఫిర్యాదుదారునికి తెలియజేస్తారు. ప్రయాణికుల ఫిర్యాదులు అన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకొచ్చే ప్రయత్నం ఇది. ఈ యాప్ లో పలు హెల్ప్ లైన్ నంబర్లు కూడా ఉంటాయి.  అవసరంలో వెంటనే కాల్ చేసి సాయం పొందొచ్చు. ఆఫ్ లైన్, ఆన్ లైన్ విధానంలోనూ ఫిర్యాదులు చేయవచ్చు.

More Telugu News