Rahul Gandhi: పరువు నష్టం కేసులో కోర్టుకు హాజరైన రాహుల్... అభియోగాల నమోదు!

  • మహాత్ముడిని చంపింది ఆర్ఎస్ఎస్ అన్న రాహుల్ 
  • ఆర్ఎస్ఎస్ కార్యకర్త కేసు 
  • నేరం చేయలేదన్న రాహుల్

రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ కార్యకర్త దాఖలు చేసిన పరువునష్టం కేసులో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఈ రోజు మహారాష్ట్రలోని భివాండి కోర్టుకు హాజరయ్యారు. ఈ ఉదయం ముంబై ఎయిర్ పోర్టుకు చేరుకున్న అనంతరం అక్కడి నుంచి భివాండి మేజిస్ట్రేట్ కోర్టుకు రాహుల్ వెళ్లారు.

 2014లో థానే ర్యాలీ సందర్భంగా... మాహాత్మాగాంధీని హత్య చేసింది ఆర్ఎస్ఎస్ అంటూ రాహుల్ వ్యాఖ్యానించారు. దీనిపై ఆర్ఎస్ఎస్ కార్యకర్త రాజేష్ కుంతే భివాండి కోర్టులో పరువు నష్టం కేసు వేశారు. విచారణలో భాగంగా రాహుల్ కు వ్యతిరేకంగా సెక్షన్ 499, 500 కింద కోర్టు అభియోగాలను నమోదు చేసింది. అయితే, తాను నేరం చేయలేదని రాహుల్ కోర్టుకు స్పష్టం చేశారు.

 విచారణ అనంతరం రాహుల్ ముంబైకి తిరిగి వెళ్లిపోయారు. 2019 లోక్ సభ ఎన్నికల సన్నాహాల్లో భాగంగా ఆయన 15,000 మంది బూత్ స్థాయి కార్యకర్తలతో ముంబైలో సమావేశం నిర్వహించనున్నారు.

More Telugu News