shilpa shetty: బిట్ కాయిన్ కుంభకోణంలో శిల్పాశెట్టి భర్తకు ఊరట.. సన్నీలియోన్, నేహాధూపియాల విచారణ?

  • కుంద్రాకు వ్యతిరేకంగా ఆధారాలు లేవన్న విచారణాధికారి
  • స్కామ్ సూత్రధారి భరద్వాజ్ తో కుంద్రాకు సంబంధాలు  
  • పలువురు బాలీవుడ్ ప్రముఖులను విచారించనున్న ఈడీ
బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా బిట్ కాయిన్ స్కాములో ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కేసు నుంచి ఆయన బయటపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. విచారణలో రాజ్ కుంద్రాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాలు లభించలేదని విచారణాధికారి, సైబర్ సెల్ ఇన్స్పెక్టర్ మనీషా జెందే తెలిపారు. ఈ స్కామ్ కు సూత్రధారిగా భావిస్తున్న భరద్వాజ్ అనే వ్యక్తితో కుంద్రాకు సంబంధాలు ఉన్నాయని పోలీసులు అనుమానిస్తున్నారు.

మరోవైపు, ఈ స్కామ్ లో పలువురు బాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించవచ్చని తెలుస్తోంది. వీరిలో సన్నీలియోన్, నేహాధూపియా, ప్రాచీ దేశాయ్, కరిష్మా తన్నా, జరీన్ ఖాన్, సోనాల్ చౌహాన్, ఆర్తి ఛబ్రియా, నర్గీస్ ఫక్రీ, హ్యూమా ఖురేషీలు ఉన్నట్టు సమాచారం.
shilpa shetty
raj kundra
bit coin
Sunny Leone
neha dhupia
bollywood

More Telugu News