sri reddy: నాని లీగల్ నోటీసులపై శ్రీరెడ్డి స్పందన

  • నేను కూడా చట్ట పరంగానే పోరాడుతా
  • నానీ.. తెర బయట నీ అంత మంచోడు లేడన్నట్టు పోజులు ఇస్తావ్
  • నీ నిజస్వరూపం తెలిస్తే.. అందరూ నీ మొహం మీద ఉమ్ముతారు
తనను కించపరుస్తూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్న సినీ నటి శ్రీరెడ్డికి హీరో నాని లీగల్ నోటీసులు పంపిన విషయం తెలిసిందే. తన న్యాయవాదుల ద్వారా ఈ నోటీసులు పంపాడు. ఏడు రోజుల్లోగా సిటీ సివిల్ కోర్టులో శ్రీరెడ్డి సమాధానం చెప్పాలని నాని లాయర్లు తెలిపారు.

ఈ నేపథ్యంలో శ్రీరెడ్డి స్పందించింది. తాను కూడా చట్టపరంగానే పోరాడతానని ట్వీట్ చేసింది. ఇదే సమయంలో నానిపై మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేసింది. "నాని, తెర బయట నీ అంత మంచోడు లేడన్నట్టు పోజులు ఇస్తావ్. నీ నిజ స్వరూపం తెలిస్తే... నీ కుటుంబసభ్యులు, ప్రజలు నీ మొహం మీద ఉమ్ముతారు. ఛీ ఛీ" అంటూ మండిపడింది.
sri reddy
nani
legal notice

More Telugu News