kamal: ఆసక్తిని రేపుతోన్న 'విశ్వరూపం 2' తెలుగు ట్రైలర్ .. ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్

  • కమల్ కథానాయకుడిగా 'విశ్వరూపం 2'
  • యాక్షన్ కి .. ఎమోషన్ కి పెద్దపీట 
  • ఆగస్టు 10వ తేదీన విడుదల 

కమలహాసన్ కథానాయకుడిగా కొంతకాలం క్రితం వచ్చిన 'విశ్వరూపం' .. అప్పట్లో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దాంతో ఆ సినిమాకి కొనసాగింపుగా కమల్ 'విశ్వరూపం 2' సినిమాను రూపొందించాడు. అయితే ఆర్ధిక పరమైన కొన్ని కారణాల వలన ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతూ వచ్చింది. ఈ సినిమా విడుదల విషయంలో అడ్డంకిగా వున్న సమస్యలను పరిష్కరించుకున్న కమల్ .. విడుదలకి సన్నాహాలు చేస్తున్నాడు.

ఆగస్టు 10వ తేదీన ఈ సినిమాను భారీస్థాయిలో విడుదల చేయనున్నాడు. ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితం తమిళ ట్రైలర్ ను శ్రుతిహాసన్ .. హిందీ ట్రైలర్ ను ఆమీర్ ఖాన్ .. తెలుగు ట్రైలర్ ను ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు. ప్రధాన పాత్రలను కవర్ చేస్తూ ఈ ట్రైలర్ ను కట్ చేశారు. యాక్షన్ .. ఎమోషన్ .. రొమాంటిక్ సీన్స్ పై కట్ చేసిన ఈ ట్రైలర్ ఆసక్తిని రేకెత్తించేదిలా వుంది. భారీతనాన్ని ఈ ట్రైలర్ ప్రతిబింబిస్తూ .. కమల్ నట విశ్వరూపం ఈ సినిమాతో మరోమారు ఆవిష్కృతం కానుందనే విషయాన్ని స్పష్టం చేస్తోంది.

More Telugu News