Pranab Mukherjee: ప్రణబ్ కి షాక్.. ఇఫ్తార్‌ విందుకు ఆహ్వానించని కాంగ్రెస్!

  • ఢిల్లీలో ఈ నెల 13న ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసిన రాహుల్  
  • ఈ విందు జాబితాలో హై-ప్రొఫైల్ నేతల పేర్లు
  • ప్రణబ్, హమీద్ అన్సారీ, కేజ్రీవాల్ కు అందని ఆహ్వానం

ఢిల్లీలో ఈ నెల 13న  కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయనున్నారు. ఈ విందుకు ఆహ్వానించే జాబితాలో హై-ప్రొఫైల్ నేతల పేర్లు ఉన్నట్టు సమాచారం. అయితే, కొందరు ప్రముఖల పేర్లు ఈ జాబితాలో లేనట్టు తెలుస్తోంది. సంబంధిత వర్గాల సమాచారం ప్రకారం, మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, మాజీ ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి, ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఇఫ్తార్ విందు ఆహ్వానం అందలేదని సమాచారం.

 దాదాపు రెండేళ్ల విరామం తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇఫ్తార్ విందు ఇవ్వనుంది. ఢిల్లీలోని తాజ్ ప్యాలెస్ హోటల్ లో ఈ విందు ఏర్పాటు చేసింది. కాగా, నాగపూర్ లో ఇటీవల నిర్వహించిన ఆర్ఎస్ఎస్ కార్యక్రమానికి ప్రణబ్ ముఖర్జీ హాజరైన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి హాజరుకావద్దంటూ ప్రణబ్ కూతురు సహా పలువురు కాంగ్రెస్ నేతలు ఆయనకు సూచించారు. అయినప్పటికీ ప్రణబ్ హాజరయ్యారు.

  • Loading...

More Telugu News