prianka chopra: భారతీయ సినిమాలు మహిళల నడుము చుట్టూ తిరుగుతాయి: ప్రియాంక చోప్రా వివాదాస్పద వ్యాఖ్యలు

  • ప్రస్తుతం ‘క్వాంటికో’లో నటిస్తోన్న ప్రియాంక చోప్రా
  • 68వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న బ్యూటీ
  • భారతీయ సినిమాల గురించి అభ్యంతరకర వ్యాఖ్యలు
  • మహిళల సౌందర్యమే ప్రధానమని వ్యాఖ్య

హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా అమెరికా టెలివిజన్‌ సిరీస్‌ ‘క్వాంటికో’లో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఆమె తాజాగా 68వ ఎమ్మీ అవార్డుల కార్యక్రమంలో పాల్గొని భారతీయ సినిమాలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. భారతీయ సినిమాలు మహిళల నడుము, శరీర సౌందర్యం చుట్టూ తిరుగుతాయని ఆమె వ్యాఖ్యానించింది. దీంతో ఆమెపై నెటిజన్లు మండిపడుతున్నారు.

ఇటీవల ‘క్వాంటికో’లో ఓ ఉగ్రవాదిని భారతీయుడిగా చూపించడంతో ఆ టెలివిజన్‌ సిరీస్‌పై విమర్శలు రాగా, ప్రియాంకతో పాటు టెలివిజన్‌ స్టూడియో ఏబీసీ క్షమాపణలు చెప్పింది. ఆ వివాదం మర్చిపోకముందే ప్రియాంక చోప్రా మరోసారి విమర్శలు ఎదుర్కుంటోంది. ఇక్కడ పేరు తెచ్చుకుని, హాలీవుడ్‌కు వెళ్లిన తరువాత మన సినిమాలపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మంచిది కాదని నెటిజన్లు విమర్శిస్తున్నారు.   

  • Loading...

More Telugu News