KTR: పేద మహిళ స్థలం కబ్జా ఘటనపై నెటిజన్ ప్రశ్నకు కేటీఆర్ స్పందన

  • సిరిసిల్లలో ఈ ఘటన జరిగినట్టు ఓ ఛానెల్ కథనం
  • ఈ లింక్ ను కేటీఆర్ కు పోస్ట్ చేసిన ఓ నెటిజన్
  • విచారణ జరపాలంటూ కలెక్టర్ ను ఆదేశించిన కేటీఆర్

తెలంగాణ మంత్రి కేటీఆర్ అండదండలతో పేద మహిళ స్థలాన్ని స్థానిక టీఆర్ఎస్ నాయకులు కబ్జా చేశారని ఓ నెటిజన్ ఆరోపించాడు. ఇందుకు సంబంధించి ఓ ఛానెల్ లో ప్రసారమైన కథనం లింక్ పోస్ట్ చేసిన నెటిజన్, దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కేటీఆర్ ను కోరాడు.

ఈ ట్వీట్ పై స్పందించిన కేటీఆర్..‘పూర్తిగా అబద్ధం. ఇందుకు సంబంధించి విచారణ చేసి న్యాయం చేయాలని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కృష్ణ భాస్కర్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా’ అని అన్నారు. కాగా, సిరిసిల్లలోని బీవై నగర్ కు చెందిన మహిళ మంగళారపు సువర్ణకు సంబంధించిన ఖాళీ స్థలాన్ని స్థానిక టీఆర్ఎస్ కౌన్సిలర్, సిరిసిల్ల మునిసిపల్ వైస్ చైర్మన్ కనకయ్య కబ్జా చేసినట్టు ఆ ఛానెల్ కథనం.

  • Loading...

More Telugu News