manchiu lakshmi: యువ దర్శకుడిని అభినందించిన రాజమౌళి

  • మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'w/o రామ్' 
  • ఆసక్తిని రేపుతోన్న ట్రైలర్ 
  • ఇండస్ట్రీ ప్రముఖుల నుంచి ప్రశంసలు  

కొత్తగా వచ్చిన టీజర్ .. ట్రైలర్ .. సినిమా ఏదైనా, వాటిని చూసి రాజమౌళి తన అభిప్రాయాన్ని వెల్లడించడం చేస్తుంటారు. ఆ సినిమా టీమ్ కి అభినందనలు తెలియజేస్తుంటారు. అలా తాజాగా ఆయన 'w/o రామ్' సినిమా యూనిట్ ను ప్రశంసించారు. విజయ్ యలకంటి దర్శకత్వంలో మంచు లక్ష్మి ప్రధాన పాత్రగా 'w/o రామ్' సినిమా రూపొందింది.

థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో మర్డర్ మిస్టరీగా ఈ సినిమా నిర్మితమైంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను వదిలారు. ఇంట్రెస్టింగ్ వున్న ఈ ట్రైలర్ ఈ సినిమాపై అందరిలోనూ ఆసక్తిని పెంచేసింది. ఈ ట్రైలర్ చూసిన రాజమౌళి స్పందిస్తూ, "ఆసక్తికరమైన థ్రిల్లర్ .. ఈ తరహా కథను ఎంచుకుని, దానిని ఇలా ఆవిష్కరించిన తీరు బాగుంది. ఈ సినిమాతో సక్సెస్ ను అందుకోవాలని ఆశిస్తున్నాను .. ఈ సినిమా టీమ్ కి నా శుభాకాంక్షలు" అంటూ చెప్పారు. ప్రియదర్శి .. ఆదర్శ్ బాలకృష్ణ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.    

  • Loading...

More Telugu News