muncipal dee: శ్రీకాకుళం మున్సిపల్ డీఈఈ ఇంటిపై ఏసీబీ దాడులు

  • ఇప్పటి వరకురూ.1.50 కోట్ల అక్రమాస్తుల గుర్తింపు
  • దెందులూరు మండలంలో 32 ఎకరాల భూమి, విశాఖలో ఫ్లాట్లు
  • విశాఖ సహా పది చోట్ల కొనసాగుతున్న తనిఖీలు
శ్రీకాకుళం మున్సిపల్ డీఈఈ శ్రీనివాసరాజుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఆయన ఇంటిపై ఏసీబీ దాడులు చేసింది. ఇప్పటి వరకు రూ.1.50 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. విశాఖపట్టణం, సీతమ్మధారలోని శ్రీనివాసరాజు ఇంట్లో రూ.12.50 లక్షల నగదు, 150 గ్రాముల బంగారం, రెండు కిలోల వెండి స్వాధీనం చేసుకున్నారు.

అలాగే, పశ్చిమగోదావరి జిల్లా దెందులూరు మండలంలో 32 ఎకరాల భూమి, విశాఖలోని నార్త్ టెన్షన్ కాలనీలో 183 సెంట్ల స్థలంతో పాటు సీతమ్మధారలోని ఓ అపార్ట్ మెంట్ లో ఫ్లాట్లు, రెండు బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. విశాఖ సహా పది చోట్ల ఏసీబీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి.
muncipal dee
srinivas raj

More Telugu News