Donald Trump: సింగపూర్‌లో డొనాల్డ్‌ ట్రంప్‌, కిమ్‌!

  • సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో జూన్ 12న భేటీ 
  • శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి చర్చలు
  • సింగపూర్‌లోని ఓ హోటల్‌లో ట్రంప్‌ బస
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ సింగపూర్‌ చేరుకున్నారు. అంతకు ముందు సింగపూర్‌కి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా చేరుకున్నారు. వారిద్దరి చారిత్రక సమావేశం సింగపూర్‌లోని సెంటోజా ఐలాండ్ రిసార్ట్‌లో జూన్ 12న జరగనుంది. వారిరువురూ కొన్ని నెలల క్రితం ఒకరినొకరు రెచ్చగొట్టుకోవడంతో యుద్ధ వాతావరణం ఏర్పడిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో మధ్యవర్తుల ప్రమేయంతో, ఉద్రిక్త పరిస్థితులు చెలరేగకుండా శాంతియుత వాతావరణాన్ని కొనసాగించడానికి ఈ భేటీ ఏర్పాటైంది. ఉత్తరకొరియా అణు అంశాలపై వీరు చర్చిస్తారు. సింగపూర్‌లోని పాయలెబర్‌ వైమానిక స్థావరం నుంచి సెంట్రల్‌ సింగపూర్‌లోని ఓ హోటల్‌కు చేరుకున్న ట్రంప్‌ అక్కడే బసచేయనున్నారు.            
Donald Trump
kim
america
North Korea

More Telugu News