Tollywood: ‘టై ఎక్కడ’ అని నాగ చైతన్య.. ‘వీకెన్ డూ దిస్’ అంటూ డ్యాన్స్ చేస్తున్న సమంత: పెళ్లి వీడియో విడుదల

  • ఓ వీడియో పోస్ట్ చేసిన సమంత
  • ప్రామిస్ చేసినట్టుగానే మా పెళ్లిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా
  • ఈ వీడియోలో చై-సామ్ డ్యాన్స్.. డ్రమ్ వాయించిన రానా

గత ఏడాది అక్టోబర్ లో నాగచైతన్య - సమంత వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాల్లో చురుగ్గా ఉండే సమంత తమ పెళ్లికి సంబంధించిన ఓ వీడియోను పోస్ట్ చేసింది. ఆసక్తికర సన్నివేశాలతో ఉన్న ఈ వీడియోను సమంత తన ఇన్ స్టా గ్రామ్ ఖాతాలో పొందుపరిచింది. 

‘మీకు ప్రామిస్ చేసినట్టుగానే చై-సామ్ పెళ్లిలోకి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. ఇంత బాగా వీడియో తీసిన జోసెఫ్, రాధిక్ కు ధన్యవాదాలు. దేశంలోనే మీరు బెస్ట్’ అని సమంత చెప్పింది. ఇక, ఈ వీడియోలో నాగచైతన్య పెళ్లికొడుకులా తయారవుతూ ‘టై ఎక్కడ..’ అని నవ్వుతూ అఖిల్ ని అడగడం కనబడుతుంది. 

‘వీ కెన్ డూ దిస్..వీ కెన్ డూ దిస్’ అంటూ సమంత పాడుతూ డ్యాన్స్ చేయడం గమనించవచ్చు. వీటితో పాటు నాగ చైతన్య-సమంత కలిసి ఉన్న దృశ్యాలు, డ్రమ్ వాయిస్తూ రానా, నాగార్జున-సమంత లు ఆప్యాయంగా మాట్లాడుకుంటూ ఉండటం ఈ వీడియోలో కనపడుతుంది.

  • Loading...

More Telugu News