amith shah: నాలుగేళ్లలో మోదీ ఏం చేశారని రాహుల్‌ అడుగుతున్నారు.. అసలు నాలుగు తరాలుగా కాంగ్రెస్‌ ఏం చేసింది?: అమిత్‌ షా

  • కాంగ్రెస్‌ దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయింది?
  • మేము అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు
  • భారత్‌ను ప్రపంచంలో ఓ గౌరవనీయమైన స్థానంలో ఉంచాము
ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీపై బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్‌ షా మండిపడ్డారు. ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ... 'ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ నాలుగేళ్లలో ఏం చేశారని రాహుల్‌ గాంధీ అడుగుతున్నారు. మేము ప్రజలకు జవాబుదారీతనంగా ఉంటాము... రాహుల్‌కి కాదు.. మేము అధికారంలో ఉండే అవకాశాన్ని ప్రజలు ఇచ్చారు. ఈ నాలుగేళ్లలో ఏం చేశారని రాహుల్‌ మమ్మల్ని ప్రశ్నిస్తున్నారు.. అసలు నాలుగు తరాల పాటు మీరేం చేశారని ఆయనను ప్రజలు అడుగుతున్నారు. దేశాన్ని ఎందుకు అభివృద్ధి చేయలేకపోయారు?' అని అన్నారు.

మోదీ సర్కారు మన దేశ సరిహద్దులను రక్షిస్తోందని అమిత్‌ షా అన్నారు. పాకిస్థాన్‌ రాత్రి, పగలు దాడులకు పాల్పడుతోందని, మోదీ సర్కారు పాలనలో మన దళాలు సర్జికల్‌ స్ట్రయిక్స్ జరిపాయని, 'భారత్‌ మాతా కి జై' నినాదాలు చేస్తూ తిరిగి వచ్చాయని అన్నారు. అలాగే, ఎన్డీఏ సర్కారు భారత్‌ను ప్రపంచంలో ఓ గౌరవనీయమైన స్థానంలో ఉంచిందని పేర్కొన్నారు.             
amith shah
India
Rahul Gandhi

More Telugu News