Bollywood: ‘హాయ్ గైస్..’ అంటున్న జాన్వీకపూర్ ఫొటో షూట్ వీడియో ఇది!

  • వోగ్ మ్యాగ్ జైన్ ఫొటో షూట్ లో పాల్గొన్న జాన్వీ
  • తన మొట్టమొదటి ఫొటో షూట్ అని చెప్పిన అందాల భామ
  • ఆకట్టుకుంటున్న జాన్వీ కపూర్ పోజులు

బోనీకపూర్ - శ్రీదేవి తనయ జాన్వీకపూర్ విడుదల చేసిన ఓ వీడియో ఆసక్తికరంగా ఉంది. వోగ్ మ్యాగ్ జైన్ ఫొటో షూట్ లో పాల్గొన్న వీడియోను జాన్వీ పోస్ట్ చేసింది. ‘హాయ్ గైస్, దిస్ ఈజ్ జాన్వీకపూర్ అండ్ వెల్ కమ్ టూ మై ఫస్ట్ ఎవర్ వోగ్ షూట్’ అంటూ ఈ వీడియోలో పలకరించింది. కాగా, ఫొటో షూట్ నిమిత్తం జాన్వీ ఇచ్చిన పోజ్ లు అద్భుతంగా ఉన్నాయనే చెప్పాలి. జాన్వీ తొలి సినిమా ‘ధడక్’ విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో ఈ ఫొటో షూట్ లో ఆమె పాల్గొనడం గమనార్హం. ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.

More Telugu News