Yogi Adityanath: సీఎం యోగి ఇచ్చిన చెక్కు బౌన్స్.. పెనాల్టీ కట్టిన విద్యార్థి!

  • పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థి
  • సీఎం యోగి చేతుల మీదుగా ప్రోత్సాహకం
  • బౌన్స్ అయిన లక్ష రూపాయల చెక్

సాక్షాత్తూ ముఖ్యమంత్రి ఇచ్చిన చెక్కుకే దిక్కులేకుండా పోయింది. ఖాతాలో డబ్బులేక ఆ చెక్కు బౌన్స్ అయితే.. అందుకు విద్యార్థి పెనాల్టీ చెల్లించుకోవాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్‌లో జరిగిందీ ఘటన. పదో తరగతి పరీక్ష ఫలితాల్లో అలోక్ మిశ్రా రాష్ట్రంలో ఏడో ర్యాంకు సాధించాడు. అతడి ప్రతిభను గుర్తించిన ప్రభుత్వం ఆ బాలుడిని సత్కరించింది. లక్నోలో ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో పరీక్షల్లో ప్రతిభ చూపిన విద్యార్థులను సత్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదుగా అలోక్‌కు లక్ష రూపాయల చెక్ అందించారు. ఆనందంతో ఆ చెక్కును తీసుకెళ్లిన అలోక్ దేనా బ్యాంకులోని తన ఖాతాలో జమచేశాడు.

అయితే, ఆ లక్ష రూపాయలు అతడి ఖాతాలో పడకపోగా పైపెచ్చు జరిమానా కూడా పడింది. ఈ విషయం మెసేజ్ రావడంతో ఏం జరిగిందో తెలుసుకునేందుకు బ్యాంకుకు వెళ్లిన అలోక్‌కు అధికారులు చావు కబురు చల్లగా చెప్పారు. చెక్ బౌన్స్ కావడంతో పెనాల్టీ విధించినట్టు చెప్పారు. చెక్ బౌన్స్ విషయమై అధికారులు మాట్లాడుతూ.. బారాబంకి జిల్లా స్కూల్ ఇన్‌స్పెక్టర్ సంతకంలో తేడా వల్ల చెక్ బౌన్స్ అయినట్టు చెప్పారు. అలోక్‌కు కొత్త చెక్  జారీ చేసినట్టు తెలిపారు.

More Telugu News