krishnapatnam port: మరో మైలురాయిని చేరుకున్న కృష్ణపట్నం పోర్టు.. కంటెయినర్ స్కానర్ ప్రారంభం

  • కంటెయినర్ స్కానర్‌తో  సమయం, ఖర్చు ఆదా
  • కంటెయినర్లను నేరుగా పోర్టులోకి డెలివరీ చేసే అవకాశం
  • అత్యాధునిక సాంకేతికత వినియోగంలో ముందున్నామన్న సీఈవో అనిల్ ఎండ్లూరి

అభివృద్ధిలో దూసుకుపోతున్న కృష్ణపట్నం పోర్టు కంటెయినర్ టెర్మినల్ మరో మైలురాయిని చేరుకుంది. టెర్మినల్‌లో శనివారం నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర పరోక్ష పన్నుల బోర్డు  సభ్యుడు జాన్ జోసెఫ్ కంటెయినర్ స్కానర్, రేడియేషన్ పోర్టల్  మానిటర్లను ప్రారంభించారు.  అనంతరం ఆయన మాట్లాడుతూ.. అత్యాధునిక యంత్ర పరిజ్ఞాన వినియోగంతో ఎగుమతి, దిగుమతిదారులకు బోల్డంత సమయం, ఖర్చు ఆదా అవుతాయన్నారు. పోర్టు అభివృద్ధిలో స్కానర్ ఓ మైలురాయిగా నిలుస్తుందన్నారు.

అలాగే, కంటెయినర్లను నేరుగా పోర్టులో డెలివరీ చేసే అవకాశం కలుగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతికతను ఉపయోగించడంలో కృష్ణపట్నం పోర్టు ఎప్పుడూ ముందుంటుందని పోర్టు సీఈవో అనిల్ ఎండ్లూరి అన్నారు. తాజాగా ప్రారంభించిన స్కానర్, రేడియేషన్ పోర్టల్‌తో గంటకు వందకుపైగా కంటెయినర్లను తనిఖీ చేసే అవకాశం లభించిందన్నారు.

More Telugu News