Suryapet District: సూర్యాపేట జిల్లాలో సీఐ జీపు చోరీ.. చివరికి పట్టేసిన పోలీసులు!

  • జీపులో జిమ్‌ వద్దకు వెళ్లిన సీఐ
  • జీపు డ్రైవర్‌తో మాట్లాడిన దుండగులు
  • డ్రైవర్‌ దృష్టి మళ్లించి జీపుతో పరారైన వైనం
  • చివరకు ఖమ్మం జిల్లాలో దొరికిన జీపు
మన వాహనాలను ఎవరైనా చోరీ చేసి తీసుకెళితే పోలీసులకు ఫిర్యాదు చేస్తాం. మరి పోలీసుల వాహనమే చోరీకి గురైతే? ఇటువంటి ఘటనే సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. సూర్యాపేట రూరల్ సీఐ జీపులో జిల్లా సెంటర్‌లో ఉన్న ఓ జిమ్‌ వద్దకు వెళ్లారు. ఆయన లోపలకి వెళ్లి తన పని చూసుకుంటుండగా, ఆ జీప్‌ డ్రైవర్‌ దృష్టిని మళ్లించి ఓ వ్యక్తి వెంటనే జీపును తీసుకెళ్లిపోయాడు.                

కేటుగాళ్ల కోసం పోలీసులు గాలింపు చర్యలు ప్రారంభించి ఎట్టకేలకు ఆ జీపు ఆచూకీని గుర్తించారు. ఖమ్మం జిల్లా చింతకాని మండలం జగన్నాథపురం వద్ద ఆ కారును తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ చోరీకి పాల్పడింది సూర్యాపేట ఇందిరమ్మ కాలనీకి చెందిన లింగరాజు అనే వ్యక్తని, అతని మానసిక పరిస్థితి సరిగా లేదని పోలీసులు అంటున్నారు. 
Suryapet District
Police
jeep

More Telugu News