rtc: ఆర్టీసీ కార్మికుల సమ్మెపై ప్రగతి భవన్‌లో కేసీఆర్‌తో మంత్రుల చర్చలు

  • ప్రగతిభవన్‌లోనే ఆర్టీసీ యూనియన్లు
  • సమ్మె విరమించజేసే ప్రయత్నం చేస్తోన్న సర్కారు
  • కాసేపట్లో ప్రకటన?
తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెకు సిద్ధమవుతోన్న విషయం తెలిసిందే. ఈ విషయంపై ఈరోజు హైదరాబాద్‌లో తెలంగాణ మంత్రి కడియం శ్రీహరి నేతృత్వంలో ఆయన నివాసంలో మంత్రులు హరీశ్‌ రావు, ఈటల రాజేందర్‌, తుమ్మల నాగేశ్వరరావు, కేటీఆర్, మహేందర్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి భేటీ అయి చర్చలు కూడా జరిపారు. అనంతరం టీఎంయూ నేతల ప్రతిపాదనలతో వారంతా ప్రగతిభవన్‌కు వెళ్లి సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు.

ఆ ప్రతిపాదనల గురించి కేసీఆర్‌కు మంత్రులు వివరించారు. తాజాగా, వారు  టీఎంయూ నేతలను ప్రగతిభవన్‌కు పిలిపించి మళ్లీ చర్చలు జరుపుతున్నారు. ఆర్టీసీ కార్మికులు సమ్మె విరమించుకుంటే తాము వారి సమస్యలపై పూర్తిస్థాయిలో చర్చిస్తామని సర్కారు అంటోన్న విషయం తెలిసిందే. సమ్మెకు దిగడం లేక విరమించుకోవడంపై ఈరోజు రాత్రి టీఎంయూ ప్రకటన చేసే అవకాశం ఉంది.         
rtc
strike
Telangana
KCR

More Telugu News