anil kapoor: అమ్మా, నీతో రోజూ మాట్లాడలేకపోతున్నందుకు క్షమించు: నటుడు అనిల్ కపూర్

  • మా అమ్మతో రోజూ మాట్లాడమని నా భార్య చెబుతుండేది
  • నేషనల్ టెలివిజన్ వేదికగా అమ్మకు క్షమాపణలు చెబుతున్నా
  • రియాల్టీ షో ‘దస్ కా దమ్’లో అనిల్ భావోద్వేగం
అమ్మ గురించి ప్రస్తావన వచ్చిన సందర్భంలో బాలీవుడ్ సీనియర్ నటుడు అనిల్ కపూర్ భావోద్వేగం చెందారు. దాదాపు తొమ్మిదేళ్ల విరామం తర్వాత సల్మాన్ ఖాన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘దస్ కా దమ్’ రియాల్టీ షోకు అనిల్ కపూర్ హాజరయ్యారు. ఈ షోలో పాల్గొన్న వారి ఐక్యూనే కాకుండా, భావోద్వేగాలను కూడా పరీక్షిస్తుంటారు.

 ‘రోజులో ఒక్కసారైనా తమ తల్లితో మాట్లాడేవాళ్లు ఎంత మంది ఉంటారో చెప్పండి?’ అనే ప్రశ్నకు అనిల్ కపూర్ భావోద్వేగం చెందాడు. తన తల్లితో రోజూ మాట్లాడలేకపోతున్నందుకు ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.  

‘మా అమ్మతో రోజూ మాట్లాడమని, నా స్నేహితులతో టచ్ లో ఉండమని నా భార్య సునీత నాకు చెబుతూనే ఉండేది. నేషనల్ టెలివిజన్ వేదికగా మా అమ్మకు క్షమాపణలు చెబుతున్నాను..’ అంటూ అనిల్ కపూర్ భావోద్వేగం చెందారు. కాగా, సల్మాన్ ఖాన్ ‘రేస్ -3’ చిత్రంలో అనిల్ కపూర్ సహనటుడు. ఈ చిత్రం ప్రమోషన్ లో భాగంగా ఈ షోకు అనిల్ ని ఆహ్వానించారు. 
anil kapoor
Salman Khan
das ka dum

More Telugu News