nithin: అందమైన ఇంటి సెట్ లో 'శ్రీనివాస కల్యాణం'

  • షూటింగు దశలో 'శ్రీనివాస కల్యాణం'
  • ఈ నెలాఖరుకు టాకీ పార్టు పూర్తి 
  • ఆగస్టు 9వ తేదీన భారీ విడుదల    

దిల్ రాజు నిర్మాతగా .. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో 'శ్రీనివాస కల్యాణం' సినిమా రూపొందుతోంది. నితిన్ .. రాశి ఖన్నా జంటగా నటిస్తోన్న ఈ సినిమా, చిత్రీకరణ పరంగా చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం ఓ పండుగ నేపథ్యంలో ఇంటిల్లిపాది కలిసి పాడుకునే పాటను చిత్రీకరిస్తున్నారు. ప్రత్యేకంగా వేసిన ఇంటి సెట్ లో ఈ పాటను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా హైలైట్స్ లో ఒకటిగా ఈ పాట ఉంటుందని అంటున్నారు.ఈ సాంగ్ షూటింగ్ విరామ సమయంలో లొకేషన్లో ఆర్టిస్టులంతా కలిసి సరదాగా దిగిన ఫోటోలు .. అక్కడి సందడి వాతావరణానికి అద్దం పడుతూ వైరల్ గా మారాయి. 'శతమానం భవతి' మాదిరిగానే ఇది మంచి కుటుంబ కథ చిత్రమవుతుందనేది ఈ ఫొటోలే చెప్పేస్తున్నాయి. రెండవ కథానాయికగా నందిత శ్వేత నటిస్తోన్న ఈ సినిమాలో ప్రకాశ్ రాజ్ .. జయసుధ .. గిరిబాబు .. రాజేంద్ర ప్రసాద్, నరేశ్ ముఖ్యమైన పాత్రలను పోషిస్తున్నారు. ఈ నెలాఖరుకు షూటింగును పూర్తి చేసుకుని .. ఆగస్టు 9వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.   

More Telugu News