ramana deekshitulu: అప్పుడు గాడిదలు కాస్తున్నావా?: రమణ దీక్షితులుపై దివాకర్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు

  • ఏదో జరిగిందని తెలిసిన వెంటనే ఎందుకు చెప్పలేదు
  • నీవు దొంగ స్వామివైనా అయ్యుండాలి లేదా అందులో భాగస్వామివైనా అయ్యుండాలి
  • ఇదంతా ఒక బజారు వ్యవహారం
తిరుమల శ్రీవేంకటేశ్వరుడి నగలపై ఆరోపణలు గుప్పిస్తున్న మాజీ ప్రధాన అర్చకుడు రమణదీక్షితులుపై టీడీపీ ఎంపీ జేసీ దివాకరరెడ్డి మండిపడ్డారు. ప్రధాన అర్చకుడిగా ఉన్న సమయంలో రమణ దీక్షితులు ఆరోపణలు చేసి ఉంటే ప్రజలు వినేవారని, నమ్మేవారని అన్నారు.

 "ఏదో జరిగిందని తెలిసిన వెంటనే చెప్పాల్సిన బాధ్యత నీకు లేదా? నిద్ర పోయావా? గాడిదలు కాస్తున్నావా? దేవుడి సేవలో ఎన్నో ఏళ్ల పాటు ఉన్న నీవు అప్పుడు ఈ విషయం చెప్పలేదంటే... నీవు దొంగ స్వామి అయినా అయి ఉండాలి లేదా ఇందులో భాగస్వామివైనా అయి ఉండాలి" అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇదంతా ఒక బజారు వ్యవహారమని అన్నారు. ఒకాయనేమో ముఖ్యమంత్రి చంద్రబాబు ఇంట్లో నగలు ఉన్నాయని అంటారని, మరొకరేమో దొంగతనం జరిగిందని అంటారని, ఇంకొకాయన గునపాలతో అంతా తవ్వేశారని అంటారని ఎద్దేవా చేశారు.
ramana deekshitulu
jc diwakar reddy
chandrababu
ttd
Tirumala

More Telugu News