atm: డబ్బులు రాకపోవడంతో ఏటీఎంనే ధ్వంసం చేశాడు.. హైదరాబాదు శివారులో ఘటన!

  • చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఘటన
  • రాయితో ఏటీఎం స్క్రీన్ ధ్వంసం
  • సీసీ కెమెరాల ఫుటేజ్ ను పరిశీలిస్తున్న పోలీసులు
ఏటీఎంలో డబ్బులు తీసుకోవడానికి వెళ్లిన ఓ గుర్తు తెలియని వ్యక్తి... ఏటీఎంలో డబ్బులు రాకపోవడంతో చివరకు దాన్ని ధ్వంసం చేసిన ఘటన హైదరాబాదు శివారు చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. సర్కిల్ ఇన్స్ పెక్టర్ తిరుపతిరావు కథనం ప్రకారం... నల్లగండ్ల సమీపంలో పంజాబ్ నేషనల్ బ్యాంకుకు చెందిన ఓ ఏటీఎం ఉంది.

ఓ గుర్తు తెలియని వ్యక్తి గురువారం రాత్రి డబ్బులు డ్రా చేయడానికి ఏటీఎంకు వచ్చాడు. కార్డు పెట్టి పిన్ ఎంటర్ చేశాడు. ఏటీఎంలో డబ్బు లేకపోవడంతో, క్యాష్ రాలేదు. దీంతో, సదరు వ్యక్తి తీవ్ర ఆగ్రహానికి లోనయ్యాడు. రాయితో ఏటీఎం స్క్రీన్ బద్దలు కొట్టి వెళ్లిపోయాడు. ఏటీఎంను ధ్వంసం చేసిన వ్యక్తిని గుర్తించేందుకు సీసీ కెమెరాల ఫుటేజీని పోలీసులు పరిశీలిస్తున్నారు. అయితే, ఆ వ్యక్తి హెల్మెట్ పెట్టుకుని ఉండటంతో, అతన్ని గుర్తించడం కష్టమవుతోంది.
atm
damage
punjab national bank
chanda nagar

More Telugu News