haryana: హర్యానా ప్రభుత్వం సంచలన నిర్ణయం... క్రీడాకారులు 33 శాతం సంపాదనను స్పోర్ట్స్ కౌన్సిల్ కి చెల్లించాల్సిందే!

  • రాష్ట్ర క్రీడల శాఖ ఆదేశాలు
  • ప్రొఫెషనల్ స్పోర్ట్స్, వాణిజ్య ప్రకటనల ఆదాయంలో ఒక వంతు చెల్లించాలని నిర్దేశం
  • దీనిపై క్రీడాకారుల నుంచి అభ్యంతరం

హర్యానా ప్రభుత్వం విమర్శలకు తావిచ్చే నిర్ణయం తీసుకుంది. క్రీడాకారులను ప్రోత్సహించాల్సింది పోయి... వారు సంపాదించిన మొత్తంలో 33.3 శాతాన్ని రాష్ట్ర స్పోర్ట్స్ కౌన్సిల్ కి చెల్లించాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. ప్రొఫెషనల్ స్పోర్ట్స్, వాణిజ్య ఒప్పందాల ద్వారా వచ్చే ఆదాయంలో మూడింట ఒక వంతు మొత్తాన్ని హర్యానా స్టేట్ స్పోర్ట్స్ కౌన్సిల్ కు చెల్లించాలంటూ ఆ రాష్ట్ర క్రీడల శాఖ ఆదేశాల్ని తీసుకొచ్చిన విషయం ఆలస్యంగా వెలుగు చూసింది.

ఈ నిర్ణయం చాలా మంది క్రీడాకారులను రాష్ట్రం వీడేలా చేస్తుందన్న విమర్శలు వస్తున్నాయి. దీనిని హర్యానా రాష్ట్రానికి చెందిన ప్రముఖ క్రీడాకారిణి గీత ఫోగట్ తప్పుబట్టారు. భారీగా ఆర్జించే క్రికెటర్లకు ఈ నిబంధన అమలు చేస్తే అర్థం చేసుకోవచ్చు గానీ, కబడ్డి, బాక్సింగ్, రెజ్లింగ్ వంటి క్రీడాకారులను కూడా చెల్లించమంటే అర్థం లేదని, ఇది వారిని నిరాశపరిచేదేనని, 33 శాతం చెల్లించిన తర్వాత వారి వద్ద ఇంక ఏం మిగులుతుందని ఆమె ప్రశ్నించారు.

More Telugu News