karishma kapoor: కరిష్మాకు మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పా: రణ్ ధీర్ కపూర్

  • కరిష్మాకు మళ్లీ పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు
  • పిల్లలే ఆమె ప్రపంచం
  • స్నేహితులతో కలిసి బయటకు వెళ్లడంలో తప్పు లేదు
బాలీవుడ్ నటి కరిష్మాకపూర్ తన భర్త సంజయ్ కపూర్ నుంచి గత ఏడాది విడాకులు తీసుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత సంజయ్ తన ప్రియురాలు ప్రియను పెళ్లి చేసుకున్నాడు. మరోపక్క, ముంబైకి చెందిన వ్యాపారవేత్త సందీప్ తోష్నీవాల్ తో కరిష్మా ప్రస్తుతం ప్రేమలో ఉంది.

ఈ నేపథ్యంలో, కరిష్మా తండ్రి రణ్ ధీర్ కపూర్ స్పందించారు. కరిష్మా మళ్లీ పెళ్లి చేసుకోబోతోందని వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. మళ్లీ పెళ్లి చేసుకోమని కరిష్మాకు తాను చెప్పానని... కానీ, తనకు పెళ్లిపై ఆసక్తి లేదని ఆమె తెలిపిందని చెప్పారు. కరిష్మాకు తన పిల్లలే ప్రపంచమని, ఆమె మరొకరి ప్రేమలో లేదని తెలిపారు. సందీప్ గురించి తనకు తెలియదని చెప్పారు. స్నేహితులతో కలసి బయటకు వెళ్లడంలో తప్పు లేదని ఆయన అన్నారు.
karishma kapoor
randhir kapoor
marriage
sandeep toshniwal
bollywood

More Telugu News