petrol diesel prices today: ఈ రోజు మరింతగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

  • వరుసగా పదో రోజు ధరల్లో తగ్గుదల 
  • పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 15 పైసలు 
  • హైదరాబాద్ లో పెట్రోల్ లీటర్ రూ.82.01
  • డీజిల్ ధర లీటర్ రూ.74.54

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపు కొనసాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలు క్షీణించడంతో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజుకు కొంత చొప్పున తగ్గిస్తూ వస్తున్నాయి. ధరల పెంపు విషయంలో వడ్డింపు ఎక్కువగా ఉంటే, తగ్గింపు మాత్రం పది పైసల లోపే ఉంటోంది. కాకపోతే ఈ రోజు మాత్రం తగ్గింపు రెండంకెలకు చేరింది. పెట్రోల్ పై 21 పైసలు, డీజిల్ పై 15 పైసలు మేర తగ్గించడం జరిగింది. దేశవ్యాప్తంగా రవాణా దూరాన్ని బట్టి, పన్నులను బట్టి పెట్రోల్, డీజిల్ ధరల్లో వ్యత్యాసాలుంటాయని తెలిసిందే. కనుక స్థానిక పన్నుల భారం కూడా పరిశీలిస్తే  తగ్గింపు ఒక్కో ప్రాంతంలో ఒక్కో విధంగా ఉంటుంది.

హైదరాబాద్ మార్కెట్లో డీజిల్ 17 పైసలు తగ్గి ఈ రోజు రూ.74.54గా ఉంది. పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.82.01గా ఉంది. వైజాగ్ సిటీలో పెట్రోల్ 21 పైసలు తగ్గి రూ.82.76గా ఉండగా, డీజిల్ 16 పైసలు తగ్గి రూ.75.01గా ఉంది. గుంటూరులో డీజిల్ 16 పైసలు తగ్గుదలతో రూ.75.86, పెట్రోల్ 22 పైసలు తగ్గి రూ.83.62గా ఉంది. ఢిల్లీలో 21 పైసలు తగ్గి పెట్రోల్ లీటర్ రూ.77.42గా, డీజిల్ 15 పైసలు తగ్గి రూ.68.58గా ఉన్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడం వరుసగా ఇది పదో రోజు. 

More Telugu News