Indian Railway: రాజధాని రైలు ఏసీ కోచ్‌లు మిస్సింగ్.. ఆర్గనైజ్‌డ్ గ్యాంగ్‌పై అనుమానం!

  • సంపర్క్ క్రాంతి రైలు ఏసీ కోచ్‌లు మాయం
  • రైల్వే యార్డ్ నుంచి అదృశ్యమైన బోగీలు
  • రైల్వే అధికారుల అయోమయం

రాంచి-న్యూఢిల్లీ మధ్య నడుస్తున్న రాజధాని ఏసీ రైలు బోగీలు మిస్సయ్యాయన్న విషయం సౌత్ ఈస్ట్రన్ రైల్వేలో సంచలనంగా మారింది. రాంచీ డివిజన్‌లోని రైల్వే యార్డ్ నుంచి ఇవి అదృశ్యమైనట్టు తెలుస్తోంది. ఏసీ కోచ్‌ల మిస్సింగ్ ఘటనపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనక ఆర్గనైజ్‌డ్ గ్యాంగ్ హస్తం ఉండొచ్చని అనుమానిస్తున్నారు.  

కోచ్‌ల మిస్సింగ్ ఘటనపై రాంచీ డివిజన్ రైల్వే అధికారుల వాదన మరోలా ఉంది. వీటిని మరో రైలుకు అనుసంధానం చేసి ఉండొచ్చని చెబుతున్నారు. తమ కోచ్‌లను తిరిగి తమకు అప్పగించాల్సిందిగా నార్తరన్ రైల్వేకు లేఖ రాసినట్టు సౌత్ ఈస్ట్రన్ రైల్వే అధికారులు తెలిపారు. త్వరలోనే అవి తిరిగి తమ వద్దకు చేరుకుంటాయని రాంచి అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News