ramana deekshithulu: 'నేను పోరాడుతూనే ఉంటాను'.. జగన్‌తో భేటీ అనంతరం రమణ దీక్షితులు స్పందన

  • మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను
  • ఈ చట్టాల వల్ల టీటీడీలో చాలా కష్టపడుతున్నాము
  • మాకు ఉన్న సౌకర్యాలన్నింటినీ తీసేశారు
  • స్వామి వారి సొత్తును, పవిత్రతను కాపాడడం నా హక్కు

హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత జగన్మోహన్‌ రెడ్డితో తిరుమల తిరుపతి దేవస్థాన మాజీ ప్రధానార్చకులు రమణ దీక్షితులు కాసేపు చర్చించిన విషయం తెలిసిందే. ఆ తరువాత రమణ దీక్షితులు మీడియాతో మాట్లాడుతూ... "మా కష్టాలు చెప్పుకోవడానికి వచ్చాను.. ఈ చట్టాల వల్ల టీటీడీలో చాలా కష్టపడుతున్నాము.. మాకు ఉన్న సౌకర్యాలన్నింటినీ తీసేశారు.

మమ్మల్ని హింసిస్తున్నారు. ఈ విషయాన్ని చెప్పుకోవడానికే వచ్చాను. మా కష్టాలు చెప్పుకోవడానికి కూడా కొందరు అవకాశం ఇవ్వలేదు. చాలా సార్లు విజయవాడకు వెళ్లి వచ్చాము.. మా కష్టాలు వినలేదు.. ఆకలిగా ఉన్నవాడు ఎవరు అన్నం పెడుతున్నారనేది చూడడు.. అన్నం పెడుతున్నాడా? లేడా? అన్నదే చూస్తాడు.

మా కష్టాలు తీర్చేవారే కావాలి.. సీఎం చంద్రబాబును మా కష్టాలు తీర్చమనండి.. ఆయన ఫొటోను మా ఇంట్లో పెట్టుకుంటాము. మాకు కావాల్సింది ప్రశాంతంగా స్వామి వారి పూజ చేసుకోవడం. స్వామి వారి సొత్తును, పవిత్రతను కాపాడడం నాకు జన్మతః వచ్చిన హక్కు అది.. నేను పోరాడుతూనే ఉంటాను" అని వ్యాఖ్యానించారు.       

More Telugu News