stock market: భారీ లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

  • 284 పాయింట్ల లాభంతో 35,463 వద్ద ముగిసిన సెన్సెక్స్‌
  • 84 పాయింట్లు లాభపడి 10,768 వద్ద ముగిసిన నిఫ్టీ
  • బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల షేర్ల జోరు
దేశీయ మార్కెట్లు ఈరోజు భారీ లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్‌ 284 పాయింట్ల లాభంతో 35,463 వద్ద ముగియగా, నిఫ్టీ 84 పాయింట్లు లాభపడి 10,768 వద్ద ముగిసింది. బ్యాంకింగ్‌, ఆటోమొబైల్‌, లోహ రంగాల షేర్లు లాభాలు చవిచూడడం, అంతర్జాతీయంగా సానుకూల సంకేతాలు ఉండటంతో సూచీలు లాభాల్లో కొనసాగాయని విశ్లేషకులు పేర్కొన్నారు.

ఎన్‌ఎస్ఈలో టాప్‌ గెయినర్స్‌: టాటామోటార్స్‌, టాటాస్టీల్‌, ఇండియాబుల్స్‌ హౌసింగ్‌ ఫైనాన్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌.

లూజర్స్‌: ఐషర్‌ మోటార్స్‌, ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, కోల్‌ఇండియా, లుపిన్‌.

stock market
India

More Telugu News