mukhesh ambani: సిద్ధి వినాయక ఆలయంలో తనయుడితో నీతా అంబానీ.. తొలి ఆహ్వాన పత్రిక సమర్పణ!

  • జూన్ 30న ఆకాష్ అంబానీ, శ్లోకాల ఎంగేజ్ మెంట్
  • సిద్ధి వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన నీతా అంబానీ
  • డిసెంబర్ లో వివాహం జరగవచ్చని సమాచారం
భారత దేశ అత్యంత సంపన్నుడు ముఖేష్ అంబానీ, నీతా అంబానీల పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ తన బాల్య స్నేహితురాలు శ్లోకాను పెళ్లాడబోతున్న సంగతి తెలిసిందే. జూన్ 30న వీరి ఎంగేజ్ మెంట్ అంగరంగ వైభవంగా జరగబోతోంది. ఇప్పటికే ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన ఆహ్వాన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ నేపథ్యంలో ఆకాశ్ తో కలసి నీతా అంబానీ ముంబైలోని ప్రముఖ సిద్ధి వినాయక ఆలయానికి వెళ్లారు. అక్కడ వినాయకుడికి ప్రత్యేక పూజలను నిర్వహించి, ఎంగేజ్ మెంట్ కు సంబంధించిన తొలి ఆహ్వానపత్రికను అక్కడ ఉంచారు.

ఈ ఏడాది మార్చి 24న శ్లోకాకు అకాష్ ప్రపోజ్ చేశారు. ఆ తర్వాత ఇరు కుటుంబాలు వీరి వివాహానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాయి. ఈ క్రమంలో ఇరు కుటుంబాలు కలసి సెలబ్రేషన్స్ జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బాలీవుడ్ తారలు కదలివచ్చారు. ఆకాశ్, శ్లోకాలు కలిసి చదువుకున్నారు. డిసెంబర్ లో వీరి వివాహం జరగవచ్చని సమాచారం.
mukhesh ambani
nita ambani
akash ambani
shloka
engagement
sidhivinayaka

More Telugu News