krishnavamsi: గ్రామీణ నేపథ్యంలో కృష్ణవంశీ మరో చిత్రం

  • గ్రామీణ నేపథ్యం దిశగా కథలు 
  • అనూహ్యమైన విజయాలు 
  • ఆ దిశగా కృష్ణవంశీ ప్రయత్నాలు  
 గ్రామీణ నేపథ్యంలో ఇటీవల వచ్చిన 'రంగస్థలం  సినిమా పల్లె వాతావరణాన్ని అద్భుతంగా ఆవిష్కరించి, అనూహ్యమైన విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు కృష్ణవంశీ కూడా గ్రామీణ నేపథ్యంతో కూడిన ఒక కథను సిద్ధం చేసుకుంటున్నట్టుగా సమాచారం.

కృష్ణవంశీ సినిమాల్లో సహజంగానే తెలుగుదనం కాస్త ఎక్కువగానే కనిపిస్తూ ఉంటుంది. కథను బట్టే ఆయన నటీనటులను ఎంపిక చేసుకుంటూ వుంటారు. అలా గ్రామీణ వాతావరణంలో ఆయన తెరకెక్కించిన 'చందమామ' ఒక దృశ్యకావ్యమనే అనిపించుకుంది. ఈ సారి కూడా ఆయన అదే తరహాలో .. కొత్త నటీనటులతో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారట. త్వరలోనే అందుకు సంబంధించిన వివరాలు తెలియనున్నాయి.     
krishnavamsi

More Telugu News