Karnataka: కర్ణాటకలో ‘కాలా’ను వదలని కష్టాలు!

  • ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల
  • కర్ణాటకలో అడ్డుపడుతోన్న కన్నడ సంఘాలు 
  • సినిమాను ప్రదర్శిస్తే ఊరుకోబోమని హెచ్చరిక

సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన ‘కాలా’ సినిమా ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన విషయం తెలిసిందే. కర్ణాటకలో కూడా ఈ సినిమా విడుదలకు లైన్‌ క్లియర్‌ అయినప్పటికీ, కన్నడ సంఘాలు అడ్డుపడ్డాయి. ముఖ్యంగా బెంగళూరులో ఆ సంఘాల కార్యకర్తలు థియేటర్ల వద్దకు భారీ సంఖ్యలో చేరుకున్నారు. ఒకవేళ తమ డిమాండ్‌ను లెక్క చేయకుండా ఆ సినిమాను ప్రదర్శిస్తే ఊరుకోబోమని, విధ్వంసం సృష్టిస్తామని హెచ్చరిస్తున్నారు. దీంతో కొన్ని థియేటర్లలో పలు షోలను రద్దు చేశారు. థియేటర్ల వద్ద ప్రభుత్వం భద్రత ఏర్పాట్లు చేసినప్పటికీ పరిస్థితి ఉద్రిక్తంగానే వుంది.

More Telugu News