mansoon: తెలంగాణలోకి నేడు ప్రవేశిస్తున్న నైరుతి రుతుపవనాలు.. వర్ష సూచన

  • రెండు రోజుల పాటు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
  • ఇప్పటికే కురుస్తున్న ముందస్తు నైరుతి వర్షాలు
  • నిన్న రాత్రి పలుచోట్ల భారీ వర్షాలు

నైరుతి రుతుపవనాలు ఈరోజు తెలంగాణలోకి ప్రవేశించబోతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. ఇప్పటికే ముందస్తు నైరుతి వర్షాలు కురుస్తున్నాయని తెలిపింది. రాయలసీమలో ఇప్పటికే రుతుపవనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి తెలిపారు.

నిన్న హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల వర్షాలు కురిశాయి. కొడంగల్ లో అత్యధికంగా 5 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. భద్రాద్రి జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఉరుములు, మెరుపులతో, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. యాదాద్రి జిల్లా వలిగొండ మండలంలో గాలివాన బెంబేలెత్తించింది. దీని ధాటికి పలు ఇళ్ల పైకప్పులు ధ్వంసమయ్యాయి.

More Telugu News