new born baby: అప్పుడే పుట్టిన బిడ్డను వదిలేసి కారులో వెళ్లిపోయిన యువతి.. వీడియో చూడండి!

  • ఉత్తరప్రదేశ్ ముజఫర్ నగర్ లో ఘటన
  • ఓ ఇంటి మెట్లపై బిడ్డను వదిలేసి వెళ్లిపోయిన యువతి
  • చిన్నారికి వైద్యం అందిస్తున్న జిల్లా అధికారులు
కారణాలు ఏమైనా కావచ్చుగాక... అప్పుడే పుట్టిన బిడ్డలను రోడ్లమీద, చెత్తకుప్పల్లో పడేసి వెళ్లిపోతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఘటనే దేశ వ్యాప్తంగా సంచలనం రేపుతోంది. ఓ వీధి గుండా వెళ్తున్న మహిళ తన శాంత్రో కారు ఎడమవైపు డోరును తెరిచి గుడ్డలో చుట్టి ఉంచిన బిడ్డను ఓ ఇంటి మెట్లపై ఉంచి, వెళ్లిపోయింది.

ఈ ఘటన సీసీటీవీలో రికార్డ్ అయింది. ఉత్తరప్రదేశ్ లోని ముజఫర్ నగర్ లో ఈ దారుణ ఘటన జరిగింది. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. ఆ చిన్నారిని ప్రభుత్వ అధికారులు కాపాడారు. స్థానిక ఆసుపత్రిలో చిన్నారికి వైద్యం అందిస్తున్నారు. ప్రస్తుతం పాప పరిస్థితి విషమంగానే ఉందని జిల్లా చీఫ్ మెడికల్ ఆఫీసర్ తెలిపారు. చిన్నారి కోలుకుంటుందనే ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు.

గత ఆదివారం కూడా కేరళలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఐదు రోజుల పసిపాపను ఓ జంట వదిలేసి వెళ్లిపోయింది. నాలుగో బిడ్డను కన్నామని అందరూ తమను చిన్నచూపు చూస్తారనే ఉద్దేశంతో ఈ పని చేసినట్టు వారు తెలిపారు. ఆ తర్వాత వీరిని పోలీసులు అరెస్ట్ చేశారు.
new born baby
drop
lady
muzaffarnagar

More Telugu News