gurajada apparao: గురజాడ అప్పారావు మునిమనవడికి గౌరవ వేతనం పెంపు

  • సాంస్కృతిక శాఖ పరిధిలో గురజాడ నివాసం
  • కాంట్రాక్ట్ పద్ధతిలో మేనేజర్ గా గురజాడ మునిమనవడు
  • గౌరవ వేతనం రూ. 20 వేలకు పెంపు

తెలుగు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన సాహితీవేత్త గురజాడ అప్పారావు మునిమనవడు గురజాడ వెంకటేశ్వరప్రసాద్ గౌరవ వేతనాన్ని ఏపీ ప్రభుత్వం పెంచింది. ప్రస్తుతం ఉన్న రూ. 12,500 వేతనాన్ని రూ. 20,000లకు పెంచుతూ రాష్ట్ర పర్యాటక, భాష, సాంస్కృతిక శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా ఉత్తర్వులు జారీ చేశారు.

విజయనగరంలోని గురజాడ అప్పారావు నివాసాన్ని సాంస్కృతిక శాఖ గతంలో తన పరిధిలోకి తీసుకుంది. 1989 నుంచి ఆ నివాసంలో లైబ్రరీతో పాటు ఆయనకు చెందిన పురాతన వస్తువులను ప్రదర్శనగా ఉంచింది. దానికి గురజాడ మునిమనవడు వెంకటేశ్వరప్రసాద్ ను కాంట్రాక్ట్ పద్ధతిలో మేనేజర్ గా నియమించింది. అప్పటి నుంచి ప్రతినెలా గౌరవ వేతనాన్ని అందిస్తోంది. తాజాగా తన వేతనాన్ని పెంచాలంటూ ప్రభుత్వానికి ఆయన విన్నవించారు. ఆయన అభ్యర్థన పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వం... గౌరవ వేతనాన్ని రూ. 20,000లకు పెంచింది.

More Telugu News