Kurnool District: ప్రమాదవశాత్తు పేలిన టీడీపీ నేత గన్.. మహిళ చేతిలోకి దూసుకెళ్లిన బుల్లెట్

  • పొరపాటున పేలిన లక్ష్మారెడ్డి లైసెన్స్ డ్ గన్
  • గాయపడ్డ లక్ష్మీదేవి అనే మహిళ
  • తాడిపత్రి ఆసుపత్రికి తరలింపు

కర్నూలు జిల్లా టీడీపీ నేత లక్ష్మారెడ్డి గన్ ప్రమాదవశాత్తు పేలిన ఘటనలో ఓ మహిళ చేతిలోకి బుల్లెట్ దూసుకెళ్లింది. ఈ ఘటన కొలిమిగుండ్ల మండలం కనకాద్రిపల్లెలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో తలాలి లక్ష్మీదేవి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. వెంటనే ఆమెను చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. కేసు నమోదు చేసి, గన్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ గన్ కు లైసెన్స్ కూడా ఉంది. 

More Telugu News