Pawan Kalyan: అలాంటి క్రమశిక్షణ పవన్ కల్యాణ్ లో కనిపించడం లేదు: అశోక్ గజపతిరాజు

  • రాజకీయాల పట్ల పవన్ కు మరింత అవగాహన ఉండాలి
  • రిసార్టుల్లో దీక్ష చేస్తే ఎవరికి ప్రయోజనం?
  • నాడు ఎన్టీఆర్ పర్యటనలో ఉన్నప్పుడు తన కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేదు!
జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై, ఆయన చేసిన దీక్షపై కేంద్ర పౌర విమానయాన శాఖ మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు విమర్శలు గుప్పించారు. రాజకీయాల పట్ల పవన్ కు మరింత అవగాహన ఉండాలని సూచించారు. రిసార్టుల్లో దీక్ష చేస్తే ఎవరికి ప్రయోజనం కలుగుతుందని ప్రశ్నించారు. నాడు ఎన్టీఆర్ రాష్ట్రంలో పర్యటించినప్పుడు తన కొడుకు పెళ్లికి కూడా వెళ్లలేదని, అలాంటి క్రమశిక్షణ పవన్ లో కనిపించడం లేదని విమర్శించారు.

ఇక వైసీపీ ఎంపీల రాజీనామాల వల్ల ఎలాంటి ప్రయోజనం లేదని, ఎన్నికల ముందు రాజీనామాల డ్రామాలెందుకని ప్రశ్నించారు. ఎయిర్ ఏషియా సీఈఓల మధ్య జరిగిన ఫోన్ సంభాషణతో తమకేమి సంబంధం లేదని, అది ప్రైవేట్ వ్యక్తుల సంభాషణ అని అశోక్ గజపతి రాజు అన్నారు.  
Pawan Kalyan
ashok gajapatiraj

More Telugu News