sensex: కీలక వడ్డీ రేట్లను పెంచిన ఆర్బీఐ.. స్టాక్ మార్కెట్ పరుగులు!

  • లాభాల్లో దూసుకుపోయిన బ్యాంకింగ్, ఆటో, రియలెస్టేట్ షేర్లు
  • 276 పాయింట్లు పెరిగిన సెన్సెక్స్
  • 10,685కి చేరిన నిఫ్టీ

ఊహించిన విధంగానే మానిటరీ పాలసీలో కీలక వడ్డీ రేట్లను ఆర్బీఐ పావు శాతం పెంచింది. దీంతో స్టాక్ మార్కెట్లు లాభాల్లో దూసుకెళ్లాయి. బ్యాంకింగ్, ఆటో, రియలెస్టేట్ షేర్లు లాభాల్లో పరుగులు తీశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి... సెన్సెక్స్ 276 పాయింట్లు పెరిగి 35,179కి ఎగబాకింది. నిఫ్టీ 92 పాయింట్లు పుంజుకుని 10,685కు చేరింది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
అవంతి ఫీడ్స్ (19.86%), రిలయన్స్ కమ్యూనికేషన్స్ (10.34%), అలహాబాద్ బ్యాంక్ (8.82%), హిమాచల్ ఫ్యూచరిస్టిక్ కమ్యూనికేషన్స్ (8.70%), బజాజ్ ఎలక్ట్రానిక్స్ (8.51%).

టాప్ లూజర్స్:
బలరాంపూర్ చీనీ మిల్స్ (-6.93%), క్వాలిటీ (-4.99%), హెచ్డీఐఎల్ (-4.39%), ఏజీస్ లాజిస్టిక్స్ (-3.62%), టైమ్ టెక్నోప్లాస్ట్ లిమిటెడ్ (-3.38%).        

More Telugu News