kodi ramakrishna: ఆర్టిస్టును కావాలనుకున్నాను .. దర్శకుడిని అయ్యాను: కోడి రామకృష్ణ

  • నాటకాలు ఎక్కువగా వేసేవాడిని 
  • సినిమాల్లోకి వెళ్లాలని ఉండేది 
  • ఫోటోలు పంపిస్తూ ఉండేవాడిని

కుటుంబాలు ..  బంధాలు .. అనుబంధాల నేపథ్యంలో కోడి రామకృష్ణ ఎన్నో సినిమాలను తెరకెక్కించారు. ఫ్యామిలీ ఆడియన్స్ మనసులను దోచుకున్నారు. అలాంటి కోడి రామకృష్ణ తాజాగా ఐ డ్రీమ్స్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను గురించి ప్రస్తావించారు. "సినిమాల వైపుకు రాకముందు మా ఏరియాలో ఏ నాటకం వేసినా నేనే హీరో. తణుకు .. తాడేపల్లిగూడెం .. రాజమండ్రి .. పాలకొల్లు ప్రాంతాల్లో బాగా నాటకాలు వేసేవాళ్లం.

అల్లు రామలింగయ్య పాలకొల్లు వచ్చి నాటకాలు వేసేవారు  .. వాటిలోను నేనే హీరో. మద్రాసు వెళ్లి ఎప్పటికైనా ఆర్టిస్టును కావాలి అనే కోరిక నాలో బలంగా ఉండేది. నటీనటులు కావాలని ఏ సినిమా వారు ప్రకటన చేసినా వెంటనే ఓ మూడు ఫోటోలు పంపించేవాడిని. అలాంటి పరిస్థితుల్లోనే 'తాతా మనవడు' సినిమా విడుదలైంది. అప్పట్లో ఎక్కడ చూసినా అందరూ ఆ సినిమాను గురించే మాట్లాడుకునేవారు .. దాసరి గారి గురించి గొప్పగా చెప్పుకునేవారు. దాంతో దర్శకత్వం వైపుకు నా దృష్టి మళ్లింది" అంటూ చెప్పుకొచ్చారు.             

More Telugu News