lenovo z5: ఐఫోన్ మాదిరిగా ఉండే లెనోవో జెడ్ 5... ధర రూ.14,000లోపే

  • రెండు రకాల వేరియంట్లు
  • 6 జీబీ ర్యామ్, 64 జీబీ, 128జీబీ స్టోరేజీ
  • బాడీలో స్క్రీన్ 90 శాతం

ఇన్నాళ్లూ ఫుల్ స్క్రీన్ మొబైల్ పై యూజర్లను, మార్కెట్ వర్గాలను ఊరించిన లెనోవో ఎట్టకేలకు జెడ్5 స్మార్ట్ ఫోన్ ను చైనాలో ఆవిష్కరించింది. ముందు భాగంలో పూర్తిగా స్క్రీన్ ఉంటుందని కంపెనీ చెప్పినప్పటికీ, అది కార్యరూపం దాల్చలేదు. 18:7 యాస్పెక్ట్ రేషియోతో డిస్ ప్లే ఉండడం గమనార్హం. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నాయి. 6 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీతో ఒకటి, 6జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజీతో మరో మోడల్ ఉన్నాయి. ఈ నెల 12 నుంచి చైనాలో ముందస్తు ఆర్డర్లను స్వీకరించనుంది.

స్పెసిఫికేషన్లు
ఈ ఫోన్ 6.2 అంగుళాల పుల్ హెచ్ డీ+ డిస్ ప్లేతో ఉంటుంది. ఫోన్ మొత్తంలో స్క్రీన్ రేషియో 90 శాతం. డిస్ ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. ఆండ్రాయిడ్ ఓరియో 8.0పై పనిచేస్తుంది. క్వాల్ కామ్ 636 ప్రాసెసర్ ను ఏర్పాటు చేశారు. 3,000 ఎంఏహెచ్, వెనుక భాగంలో 16+8ఎంపీ మెగాపిక్సల్ కెమెరాలు, ముందు భాగంలో 8 మెగా పిక్సల్ కెమెరా, 4కే వీడియో ఫీచర్లు ఉన్నాయి. యూఎస్ బీ టైప్ సీ పోర్టు, ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ ఉంది.

  • Loading...

More Telugu News