Botsa Satyanarayana: మేము అధికారంలోకి రావాలనుకోవడానికి కారణం ఇదే: బొత్స

  • ప్రజల కోరికలు తీర్చాలంటే అధికారంలోకి రావాలి
  • వచ్చే ఎన్నికల్లో వైసీపీదే విజయం
  • రాజశేఖరరెడ్డి పాలనను మళ్లీ తీసుకొస్తాం
అధికారంలో ఉంటేనే ప్రజల కోరిక తీర్చగలమని... అందుకే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నామని వైసీపీ నేత బొత్స సత్యనారాయణ అన్నారు. మాయ మాటలు చెప్పి గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిందని మండిపడ్డారు. ఏపీలో ప్రజాస్వామ్య వ్యవస్థ భ్రష్టు పట్టిందని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో విజయం వైసీపీదేనని, రాష్ట్రంలో మళ్లీ రాజశేఖరరెడ్డి పాలనను తీసుకొస్తామని చెప్పారు. గుంటూరులో మీడియాతో మాట్లాడుతూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలుగుదేశం ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని... మట్టి, ఇసుక నుంచి కూడా డబ్బులు సంపాదించవచ్చని టీడీపీ నేతలు నిరూపించారని బొత్స విమర్శించారు. టీడీపీ నేతల అవినీతిని విస్తృతంగా ప్రచారం చేయాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. 2014 ఎన్నికల్లో కొద్దిపాటి తేడాతో వైసీపీ అధికారాన్ని కోల్పోయిందని... రాబోయే ఎన్నికల్లో టీడీపీకి ప్రజలు బుద్ధి చెబుతారని అన్నారు. బీజేపీతో వైసీపీకి ఎలాంటి సంబంధాలు లేవని... కావాలనే టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 
Botsa Satyanarayana
ysrcp
Telugudesam

More Telugu News