Ramgopal Varma: మా హీరోలను ఇక వదిలేయ్ బాబూ... వర్మ కటౌట్ కు పాలాభిషేకం చేసి కోరుకున్న అక్కినేని ఫ్యాన్స్!

  • వెండితెరపై 'ఆఫీసర్' పరాజయం
  • నాగ్ కెరీర్ లోనే అతిపెద్ద డిజాస్టర్
  • అక్కినేని హీరోలను వదిలేయాలని ఫ్యాన్స్ నిరసన
ఓ పోలీసాఫీసర్ నిజ జీవిత కథ అని చెబుతూ నాగార్జున హీరోగా, రామ్ గోపాల్ వర్మ తీసిన 'ఆఫీసర్' బాక్సాఫీసు వద్ద ఘోర పరాజయాన్ని చవిచూడగా, అక్కినేని అభిమానులు వినూత్న నిరసన తెలిపారు. అక్కినేని కుటుంబాన్ని వర్మ వదిలేయాలని కోరుతూ ఆయన కటౌట్ కు పాలాభిషేకం చేశారు. ఒకటవ తేదీన వెండి తెరలను తాకిన ఈ చిత్రం, కనీసం కోటి రూపాయలను కూడా వసూలు చేయలేదని వార్తలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో, నాగ్ కెరీర్ లోనే అతి పెద్ద డిజాస్టర్ గా 'ఆఫీసర్' నిలిచిందని ట్రేడ్ పండితులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇక అఖిల్ హీరోగా, తాను ఓ చిత్రం చేయనున్నట్టు వర్మ ప్రకటించడంతో ఇప్పుడు అక్కినేని అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోయింది. గత పదేళ్లుగా ఫ్లాప్ సినిమాలకు మాత్రమే పరిమితమైన వర్మ, ఇక తమ అభిమాన హీరోలను వదిలేయాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుతున్నారు.
Ramgopal Varma
Akkineni Fans
Nagarjuna
Officer

More Telugu News