Hyderabad: జస్లిన్ కౌర్ ఉదంతం నా హృదయాన్ని కదిలించింది: హైదరాబాద్ సీపీ అంజన్ కుమార్

  • ఆత్మహత్య చేసుకున్న జస్లిన్ కౌర్
  • ఆత్మహత్య బాధాకరం
  • విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోరాదు
'నీట్'లో విజయం సాధించడంలో విఫలమై, ఆత్మహత్య చేసుకున్న హైదరాబాద్ అమ్మాయి జస్లిన్ కౌర్ ఉదంతం తన హృదయాన్ని కదిలించిందని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ అంజన్ కుమార్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం మీడియాతో మాట్లాడిన ఆయన, విద్యార్థిని ఆత్మహత్య బాధాకరమని, ఆమె కుటుంబానికి తాను సానుభూతిని తెలుపుతున్నానని అన్నారు. ర్యాంకులు, మార్కులు రాలేదని విద్యార్థులు ధైర్యాన్ని కోల్పోరాదని సూచించిన అంజన్ కుమార్, సమయం కోసం ఎదురుచూసి విజయం సాధించాలని, విద్యార్థులు పట్టుదలను పెంచుకోవాలని సలహా ఇచ్చారు.
Hyderabad
Police
Jaslin Kaur
Anjan Kumar

More Telugu News