modi: మోదీ, అమిత్ షాలను సీబీఐ అరెస్ట్ చేయాలనుకుంది.. అదృష్టం బాగుండి తప్పించుకున్నారు: మాజీ డీఐజీ వంజారా

  • ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసు
  • 2014లో మోదీ, అమిత్ షాలకు క్లీన్ చిట్
  • విచారణను ఎదుర్కొంటున్న మాజీ డీఐజీ వంజారా

అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోదీ (ప్రస్తుత ప్రధాని), అప్పటి హోం మంత్రి అమిత్ షాలను అరెస్టు చేయాలని సీబీఐ అనుకుందని మాజీ డీఐజీ వంజారా సీబీఐ ప్రత్యేక కోర్టుకు తెలిపారు. అయితే, అదృష్టం బాగుండి ఇద్దరూ తప్పించుకున్నారని చెప్పారు. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఇష్రాత్ జహాన్ బూటకపు ఎన్ కౌంటర్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టులో విచారణ సందర్భంగా ఆయన ఈ మేరకు వివరాలను వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ కేసులో వంజారా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అయితే, సరైన సాక్షాధారాలను చూపించడంలో సీబీఐ విఫలమయిందంటూ మోదీ, అమిత్ షాలకు 2014లో కోర్టు క్లీన్ చిట్ ఇచ్చింది.

అప్పటి ఘటన వివరాల్లోకి వెళ్తే, గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీ హత్యకు కుట్ర జరుగుతోందంటూ పోలీసులకు సమాచారం అందింది. ఈ నేపథ్యంలో ఇష్రాత్ జహాన్ తో పాటు ఆమె స్నేహితులు జావెద్ అలియాస్ ప్రాణేశ్, పాకిస్థాన్ కు చెందిన జీహాన్ జొహార్, అంజాద్ రాణా అనే యువకులను ఒక టెర్రరిస్ట్ టీమ్ గా పోలీసులు అనుమానించారు. దీంతో, అప్పటి డీఐజీ వంజారా నేతృత్వంలో పోలీసులు వారిని ఎన్ కౌంటర్ చేసి చంపారు. అయితే, వారు టెర్రరిస్టులు కాదనే విషయం సీబీఐ విచారణలో తేలింది. వంజారా కుట్రపూరితంగా వారిని చంపారని సీబీఐ కేసు నమోదు చేసింది. కాగా, కేసు నుంచి తమను విముక్తి చేయాలంటూ వంజారాతో పాటు మరో పోలీసు ఉన్నతాధికారి అమిన్ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది. ఈ కేసుకు సంబంధించి విచారణ ఇంకా కొనసాగుతోంది.

  • Loading...

More Telugu News