Congress: ఏపీ మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జ్‌గా తెలంగాణ మహిళా నేత!

  • సీతక్కను నియమిస్తూ ఉత్తర్వులు
  • ఇటీవలే కాంగ్రెస్ లో చేరిన ములుగు మాజీ ఎమ్మెల్యే
  • హర్షం వ్యక్తం చేసిన సీతక్క
ఆంధ్రప్రదేశ్ మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా తెలంగాణ కాంగ్రెస్ మహిళా నేత, ములుగు మాజీ ఎమ్మెల్యే ధనసరి సీతక్క (అనసూయ) నియమితులయ్యారు. మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సుస్మితాదేవ్ ఈ మేరకు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నిన్నమొన్నటి వరకు టీడీపీలో క్రియాశీలక పాత్ర పోషించిన సీతక్క ఇటీవల మరో నేత రేవంత్‌రెడ్డితో కలిసి కాంగ్రెస్ లో చేరిన విషయం తెలిసిందే.

ములుగు నియోజకవర్గంలో కాంగ్రెస్ బలోపేతానికి ఆమె చేసిన కృషిని పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం సీతక్కపై నమ్మకంతో ఏపీ మహిళా కాంగ్రెస్ ఇన్‌చార్జిగా నియమించింది. ఆమె నాయకత్వంలో ఏపీ మహిళా కాంగ్రెస్ మరింత బలోపేతం అవుతుందని సుస్మితాదేవ్ ఆశాభావం వ్యక్తం చేశారు. అధిష్ఠానం తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సీతక్క హర్షం వ్యక్తం చేశారు.
Congress
Seehakka
Mulugu
Andhra Pradesh

More Telugu News