Pawan Kalyan: పవన్ మహానుభావుడు.. సీఎం అవుతాడు: అరకు వృద్ధురాలు

  • ఉత్తరాంధ్ర పర్యటనలో పవన్ బిజీ
  • అరకు ఏజెన్సీలో గిరిజనుల కష్టాలు తెలుసుకున్న నేత
  • ఫిదా అవుతున్న గిరిజనులు
ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా అరకు ఏజెన్సీలో ఉన్న జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు స్థానికుల నుంచి అనూహ్య మద్దతు లభిస్తోంది. ఇప్పటి వరకు ఏ నాయకుడు తమ ఊరికి వచ్చి కష్టసుఖాలు అడగలేదని, కానీ ఈ బాబు వచ్చి అడిగాడని జనాలు చెబుతున్నారు. అతడు తప్పకుండా తమకు మేలు చేస్తాడని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ఏజెన్సీలో ఉన్న పవన్ అక్కడి గిరిజన యువతీయువకులతో సమావేశం నిర్వహించి వారి కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. వారు పడుతున్న ఇబ్బందులను తీర్చేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. మహిళలు ముఖ్యంగా గర్భిణులు పడుతున్న అవస్థలు చూసి కరిగిపోయారు. వైద్యం అందక వారు పడుతున్న కష్టాలపై స్పందించారు. ఈ సందర్భంగా ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.

పవన్ కల్యాణ్ తమ వద్దకు రావడం, స్వయంగా తమ కష్టాలను అడిగి తెలుసుకోవడం, హామీలు ఇవ్వడాన్ని చూసి గిరిజనులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఓ వృద్ధురాలు మాట్లాడుతూ ఇప్పటి వరకు తమ గ్రామానికి ఒక్కడు కూడా రాలేదని, ఈ మహానుభావుడు వచ్చాడని, దండం పెడుతున్నానని ఆవేశంగా మాట్లాడింది. అతడు ముఖ్యమంత్రి అవుతాడన్న నమ్మకం తనకు ఉందని పేర్కొంది. ఇప్పుడా వృద్ధురాలి మాటల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Pawan Kalyan
jana sena
Araku
Andhra Pradesh

More Telugu News