Vijayawada: విజయవాడలో భారీ వర్షం!

  • సుమారు గంటపాటు కురిసిన వర్షం
  • ప్రధాన రహదారులు జలమయం
  • భారీ ఈదురుగాలులకు నేల కూలిన చెట్లు, హోర్డింగ్స్
విజయవాడలో ఈరోజు రాత్రి భారీ వర్షం కురిసింది. ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. సుమారు గంటపాటు వర్షం కురిసింది. దీంతో, ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. భారీగా ఈదురుగాలులు వీయడంతో, చెట్లు, హోర్డింగ్స్ నేలకూలాయి. అధికారులు ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఆయా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిపి వేశారు.

మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖాధికారులు చెబుతున్నారు. కాగా, విజయవాడతో పాటు గన్నవరం, మైలవరం, ఇబ్రహీంపట్నంలో భారీ వర్షం కురిసింది. గుంటూరు జిల్లాలోని తుళ్లూరు, తాటికొండ, మంగళగిరిలో కూడా వర్షం కురిసింది.
Vijayawada
rain

More Telugu News