Andhra Pradesh: కేంద్రాన్ని కుదిపే కుంభకోణాన్ని మరో రెండు నెలల్లో బయటపెడతా: ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు

  • ఏపీ విషయంలో బీజేపీ నేతల మాటలకు చేతలకు పొంతన లేదు
  • కేంద్రం నిధులు ఇస్తామన్నా తీసుకోవడం లేదనడం అవాస్తవం
  • కేంద్ర, రాష్ట్ర అధికారులతో తక్షణం పంచనామా చేయాలి

కేంద్రాన్ని కుదిపే కుంభకోణాన్ని మరో రెండు నెలల్లో బయటపెడతానని ఏపీ ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు కుటుంబరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, ఏపీ విషయంలో బీజేపీ నేతలు చెబుతున్న మాటలకు, వాస్తవంలో జరుగుతున్న పనులకు సంబంధం లేదని విమర్శించారు. కేంద్రం నిధులు ఇస్తామన్నా రాష్ట్రం తీసుకోవడం లేదంటూ బీజేపీ నేతలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని అన్నారు.

‘ఏపీకి ఇన్ని నిధులు ఇస్తున్నాం, ఇంత సమకూరుస్తున్నామని కేంద్రం చెబుతోంది గదా, సింపుల్ గా నేను ఒకటే ప్రశ్న అడుగుతున్నా. కేంద్రానికి చెందిన ఐదుగురు అధికారులు, రాష్ట్రానికి చెందిన ఐదుగురు అధికారులను నియమించి కేంద్ర ప్రభుత్వాన్ని తక్షణం పంచనామా చేయమనండి. లెక్క తేలిపోతుంది. కేంద్రం చాలా వివక్ష చూపుతోంది..కక్ష గట్టిందనే మాట వాస్తవం. రాష్ట్రానికి అవసరమైనప్పుడు కేంద్రం నిధులివ్వాలి. కేంద్ర ప్రభుత్వ పథకాలకు కూడా సరైన సమయంలో నిధులు విడుదల చేయాలి. ఇప్పటికైనా కేంద్రం తేరుకుని.. నిజాలు ప్రజలకు చెప్పాలి’ అన్నారు కుటుంబరావు.

More Telugu News